సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రవితేజ ఇటీవల ‘ధమాకా‘ చిరంజీవి తో కలసి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ కూడా పెద్ద విజయాలు సాధించాయి, ఇక స్వామి రారా వంటి హిట్ కొట్టి కొంతకాలంగా వెనుకబడిన భీమవరం బ్రాండ్.. సుదీర్ వర్మ దర్శకత్వంలో ఇటీవల కార్తికేయ 2, ధమాకా వంటి పెట్టి హిట్స్ ఇచ్చిన నిర్మాత .అభిషేక్ నామా, నిర్మించిన ‘రావణాసుర‘ సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించడం విశేషం.. కథ విషయానికి వస్తే.. క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్ గా పని చేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్) అనే అమ్మాయి కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తన తండ్రి కేసు టేకప్ చెయ్యమని అడిగితే, ఆమె చెయ్యను అని చెప్తుంది. అప్పుడు రవీంద్ర కలుగజేసుకొని హారిక తో నేను ఒప్పిస్తా అని చెప్పి కనకమహాలక్ష్మి ఈ కేసు టేకప్ చేయిస్తాడు, ఇంతకీ ఆ కేసు ఏంటంటే తన తండ్రి (సంపత్ రాజ్) మర్డర్ చేసినట్టుగా వీడియోలు, సాక్ష్యాలు అన్నీ పక్కాగా వున్నాయి, కానీ తన తండ్రి నిర్దోషి ఆ హత్య చెయ్యలేదు అని చెప్తుంది హారిక. ఆమె ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. అలాంటివే ఇంకొన్ని హత్యలు నగరంలో జరుగుతాయి, అందులో సిటీ కమిషనర్ (మురళి శర్మ) కూడా హత్యకు గురి అవుతాడు. హారిక కూడా హత్యకి గురి కబడుతుంది. రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న హనుమంత రావు (జయరాం) ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో? దీని వెనక ఎవరున్నారో కనుక్కోమని ఈ కేసు అతనికి ఇస్తారు. ఇంతకీ ఈ హత్యలన్నీ ఎవరు చేశారు, తెలియాలంటే ‘రావణాసుర’ సినిమా చూడాల్సిందే. దర్శకుడు సుధీర్ వర్మ బెంగాలీ సినిమా ‘విన్సీ దా’ నుండి కధ తీసుకున్నారు అని అనిపిస్తోంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చాల బాగా తీసిన కొన్ని సీన్స్ చాల పేలవంగా తీసాడనిపిస్తుంది. రవితేజ, హైపర్ ఆది, ఫారియా అబ్దుల్లా కోర్ట్ సన్నివేశాలు కొంచెం కామెడీ బాగా తీసాడు. అలాగే సుధీర్ వర్మ ఈ కథలో చాలా ఫ్లాష్ బ్యాక్ లు వాడేసాడు.దీనితో కధలో టెంపో మిస్సవుతుంది. ఈ సినిమాలో పాటలు పరవాలేదు అనిపించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం మాత్రం ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఇక సినిమా అంతా రవితేజ కనపడతాడు.తనదైన పంచ్ డైలాగ్స్ బాగున్నాయి, కానీ అతని నటన మాత్రం విలన్ షేడ్స్ తో వెరైటీ గా సరికొత్తగా కనిపించాడు. అలాగే పాటల్లో కూడా బాగా డాన్స్ చేసిపారేసాడు, ఇక హీరోయిన్స్ కి పెద్ద ప్రాధాన్యత లేదు.. మొత్తానికి ఒకసారి చూసెయ్యచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *