సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ సినిమా 20 రోజుల క్రిందట ఈ ఫిబ్రవరి 9వతేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. మంచి స్టయిలిష్ టేకింగ్ అంటూ ప్రశంసలు పొందింది. అయినప్పటికీ ఎందుచేతనో మంచి కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. నవ్‍దీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ మార్చి 1 నుంచే స్ట్రీమిం గ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కిం చుకున్న నేపథ్యంలో అధికారికంగా డేట్ ప్రకటించవలసి ఉంది.
