సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), అభిమానులు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) అభిమానులు ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ఎదురుచూస్తున్నా 1000 కోట్ల బడ్జెట్ సినిమా SSMB 29 నేటినుంచి ఈ సినిమా అధికారికం గా షూటింగ్ ప్రారంభించారు. అంటే ఈ కొత్త ఏడాది నుండి రాజమౌళి జైలులోకి మహేష్ బాబు వెళ్ళిపోతున్నాడన్న మాట.. నిజానికి గత ఏడాది నుండి మహేష్ ఏ సినిమా చెయ్యలేదు..మరి ఎన్ని ఏళ్లకు బయటకు వస్తోడో? కానీ మహేష్ ను హాలివుడ్ కు కూడా సూపర్ స్టార్ చెయ్యాలని రాజమౌళి కంకణం కట్టుకున్నారు. ఈ కొత్త సినిమా నేడు, గురువారం ఉదయం పూజా కార్య క్రమం హైదరాబాద్ నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారని సమాచారం. మహేష్ బాబు రాజమౌళి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నపటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన, ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. రెండు భాగాల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని టాక్.
