సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులోని రాయలం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నేడు, సోమవారం ఉదయం స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సుమారు వందమంది పిల్లలకు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, బ్యాగ్ తో కూడిన స్టూడెంట్స్ ప్రభుత్వ కిట్స్ ను పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వ సహకారం ఉంటుందని , అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సందర్భంగా రాయలం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు గ్రామ టిడిపి నాయకులు, మహిళలు ఘన స్వాగతం తెలిపారు.
