సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాయలం అంటే సమాజ సేవలో ముందు ఉంటుందని మరోసారి రుజువు చేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. రాయలం గ్రామ ప్రజలు విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రూ 5,00,116 లను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. కష్ట సమయంలో బాధితులను ఆదుకోవడానికి దాతలు స్పందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో రాయలం జనరల్ సెక్రటరీ పత్తి హరివర్థన్, మాజీ సర్పంచ్ గుసిడి సూరిబాబు, రాయలం మాజీ సర్పంచ్, ఇన్ ఛార్జ్ కోళ్ల రామచంద్రరావు (అబ్బులు), టీడీపి రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరి కోళ్ల నాగబాబు(పండు), తాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు కోళ్ల సీతారాం, యర్రంశెట్టి శివకృష్ణ, కోళ్ల సీతారామయ్య, కోళ్ల ఫణి, కునా శ్రీనివాస్, వీరమల్లు శ్రీను, మెల్ల ప్రవీణ్, వివి సుబ్బరాజు, విజయ, ప్రవల్లిక, దారబత్తుల నాగ శ్రీనివాస్, కనకరాజు, టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి,కోళ్ల నాగేశ్వర్రావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, గాదిరాజు సుబ్బరాజు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
