సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి పులివెందులలో ఉద్రిక్తతలు. వైసిపి నిరసనల మధ్య పులివెందుల బహిరంగ సభ లో జగన్ సర్కార్ ఫై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నేడు గురువారం ఉదయం అనంతపురం లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టుల ను నిర్లక్ష్యం చేస్తుందని ఈ అభివృద్ధి విధ్వంసం పాలనపై టీడీపీ యుద్ధభేరి ప్రకటిస్తుందన్నారు. సీఎం గా జగన్ ఈ రాయలసీమ ప్రాంతానికి ఎంత న్యాయం చేశారో తెలియచేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే అనంతపురం పేద జిల్లా అని.. తాను అధికారంలో ఉన్నపుడు నీళ్లు ఇచ్చిన తర్వాత జిల్లా బాగుపడిందన్నారు. అనంతపురానికి నీళ్లు ఇస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు తన పుణ్యమేనన్నారు. ‘‘రాయలసీమ కు గుండెలకాయ బనకచెర్ల. గోదావరి నీరు కృష్ణా మీదుగా బనకచర్ల ద్వారా రాయలసీమకు నీరు చేర్చడం .. గోదావరి నీళ్లు సీమకు ఇవ్వడం నా జీవిత ఆశయం. ఆరు నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియా ప్రాజెక్టు తీసుకుని వచ్చాను. మూడు నెలల్లో వైసీపీకి ఎక్స్పైరీ వస్తుంది. ఇక జీవితంలో వైసీపీ రాదు. ఇప్పుడు జగన్ పాలనలో అనంతపురం లో ఫ్యాక్షన్… రౌడీయిజం మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి’’ అని ఆరోపించారు చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *