సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ లో కూటమి సర్కార్ ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. .ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ ప్రశ్నించారు. ఒక వేళా బడ్జెట్ పెడితే.. ప్రజలకు సూపర్ సిక్స్ హామీల ఎగవేత తెలిసిపోతుందని వాటి కేటాయింపులపై నిలదీస్తారని చంద్రబాబు కు తెలుస్తునని, అందుకే సాగదీశారని ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాలన్నింటికి తూట్లు పొడిచారు. అమలు చేసే పథకాలకు బడ్జెట్ లో అరకొర కేటాయింపులే దానికి సాక్ష్యం.. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి రాష్ట్రము 14 లక్షల కోట్ల అప్పులలో ఉందని తప్పుడు ప్రచారం చేసారని మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం రూ.6 లక్షల 46 కోట్ల అప్పులుగా చూపారని వివరించారు. అప్పుల నియంత్రణలో ఏదైనా అవార్డు ఇవ్వాలంటే అది వైసీపీ ప్రభుత్వానికే ఇవ్వాలన్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కిన 5నెలలకే 50 వేల కోట్ల అప్పు చేసిందని మరి ఎవరి హయాంలో రాష్ట్రం శ్రీలంక అయింది?.. అప్పు రత్న బిరుదు ఎవరికీ ఇవ్వాలి?. . కూటమి నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను వారికీ నచ్చిన ప్రైవేట్ సిండికేట్లకు అప్పగించేశారని దీనితో ‘గవర్నమెంట్ కు రావాల్సిన ఆదాయం ప్రైవేట్ జేబుల్లోకి వెళ్తోంది. ఉచిత ఇసుక అంటూ ప్రస్తుతం ఇసుక రేట్లు మా ప్రభుత్వం హయాం కన్నా డబుల్ చేసారు. రాష్ట్రంలో ఇసుక దందా, పేకాట క్లబుక్ల లు నడుపుతున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. దోచేసిన దాంట్లో బాబుకింత, లోకేష్ కింత, దత్తపుత్రుడికింత అని పంచుకుంటున్నారు’’ అని వైఎస్ జగన్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *