సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట ఖ్యాతి గాంచిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి ధర్మ ప్రచారములో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు నేడు, శుక్రవారం ఉదయం ఆషాఢమాస సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్య మంత్రి కొట్టు సత్యనారాయణ మరియు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు జిల్లా కలెక్టర్ పి .ప్రశాంతి మరియు పలువురు ప్రముఖులు దేవదాయ శాఖ అధికారులు, కలసి స్థానిక త్యాగరాజ భవనం వద్ద నుండి శ్రీ అమ్మవారి కోసం పట్టు చీరలు, గాజులు, పసుపు కుంకుమలు, మిఠాయిలు, పూలు పళ్ళు, ఆభరణాలు తో భారీ స్థాయి సారె ను తమ తమ శిరస్సులపై పెట్టుకొని భక్తులతో కలసి ఊరేగింపు గా, అమ్మవారి ఘట్టాలను ధరించిన కళాకారులతో, మంగళ వాయిద్యాలతో దేవాలయం వరకు వచ్చి పండితుల వేద మంత్రాల మధ్య శ్రీ అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. మహాశక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మవారి అస్సిసులు తో రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని , ప్రార్ధించడం జరిగింది.సదరు ఊరేగింపులో పట్టణ ప్రముఖులు, దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు., చైర్మెన్ మానేపల్లి నాగన్న, దేవాలయ సహాయ కమిషనర్ భద్రజీ , వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.
