సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి . సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని చేసిన ఓ ట్వీట్‌ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ‘గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటే’ అంటూ జగన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘రిగ్గింగ్‌ మాస్టర్‌ చంద్రబాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇటీవల ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు పోటీ చెయ్యకుండా అడ్డుకొని అరాచకం సృష్టించి ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని జగన్‌ తప్పుబట్టారు.’రిగ్గింగ్‌ మాస్టర్‌’గా అభివర్ణించిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ చివర్లో ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా..!’ అని జగన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *