సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ గా మహేష్ బాబు కెరీర్ దిశ మార్చింది పోకిరి’ సినిమా అని అందరికి తెలిసిందే.. అలాగే ఆ క్రేజ్ ను అలాగే కొనసాగేలా చేసిన మరో బంపర్ హిట్ హిట్ బిజినెస్ మెన్..సినిమా ఇందులో సరికొత్త మహేష్ బాబు యాంటీ హీరో పెరఫార్మెన్సు తో అదరగొడతాడు, ఈ 2 చిత్రాలకు పూరి జగన్నాధ్ దర్శకుడు కావడం మరో విశేషం.. అయితే గత బుధవారం మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9 న మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా 4 కే క్వాలిటీతో విడుదలైన ‘బిజినెస్ మేన్’ విజయఢంకా మోగించింది. ఇప్పటివరకు మళ్ళీ ఇలా విడుదలైన రి రిలీజ్ సినిమాలలో మొదటి రోజు కలెక్షన్స్ ఈ ‘బిజినెస్ మేన్’ అల్ టైం రికార్డుగా చెపుతున్నారు. అంత పెద్దగా ప్రచారం లేకపోయినా ‘బిజినెస్ మేన్’ మళ్ళీ విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా స్పెషల్ షోస్ వెయ్యగా మొత్తం రూ.4. కోట్ల 42 లక్షలు గ్రాస్ వసూల్ చేసి అల్ టైం రికార్డుగా నిలిచింది. 2 రోజుల కలెక్షన్ 6 కోట్లు సాదిస్తుందని ఒక అంచనా.. భీమవరంలో మహేష్ అభిమానుల కోసం రికార్డు స్థాయిలో ప్రదర్శించిన 9 ఆటలకు కలపి 3లక్షల 10 వేల 485 రూపాయలు వసూలు అల్ టైం రికార్డు.. గత రికార్డు రామచరణ్ సినిమా ఆరంజ్ రీ రిలీజ్ లో 14 షోలకు 2లక్షల 83వేల రూపాయలుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *