సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి జూన్ నెలలో వర్షాలతో అడుగు పెట్టాము. గత వారం రోజులుగా భానుడి ప్రచండం తీవ్రత చవి చుసిన పచ్చని గోదావరి జిల్లాల ప్రజలు సైతం రోహిణి కార్తె ఎండల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నైరుతి రుతు పవనాలు వాతావరణ చల్లని కబురు చెప్పింది. నేటి ఆదివారం తెల్లవారు జామునుండి భీమవరం తో సహా అన్ని ప్రాంతాలు ఆకాశం మేఘ వలయంలో వర్షపు చినుకులతో చల్లగాలుల పవనాలతో పూర్తీ ఆహ్లదంగా మారిపోయింది. పలు ప్రాంతాలలో స్వల్ప వర్షం పడింది. అయితే మధ్యాహ్నం మాత్రం మేఘాల మధ్యే తీవ్ర ఉక్కపోత తప్పలేదు. నేటి ఆదివారం నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఆ ప్రభావంతో ముందుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి మరో 5 రోజులు సమయం పడుతుంది. రాష్ట్రంలో నేడు, రేపు ఎల్లుండి మూడు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ముందుగా . రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
