సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు, గురువారం తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ఇటీవల అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ బద్దలు కొట్టిందని, కేవలం 9 నెలల్లోనే ప్రస్తుతం చేసిన, తీసుకొంటున్న అప్పులు రూ.1.45 లక్షల కోట్లకుపైనే ఉన్నాయని మరి ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు సూపర్‌ సిక్స్‌ ఇచ్చారా?.. అని ప్రశ్నించారు. అమ్మవడి, మత్యకార భరోసా, కాపు నేస్తం ,జగనన్న చేదోడు.. అన్ని పధకాలు పోయాయి. పథకాలు ఏవీ అమలు కావడం లేదని, మరోప్రక్క విద్యుత్ బిల్లులు, పన్నులు పెంచేశారని మరి రూ.1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని, కొత్త పాలసీతో మద్యం షాపుల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగాలు పోయాయని జగన్ ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో మరో రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలలోకి వెళ్లి వివరిస్తానని స్పష్టం చేశారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని జగన్ విమర్శించారు. బటన్‌ నొక్కడం పెద్ద పనా? అని ఆరోజు మాట్లాడారని, సూపర్‌ సిక్స్‌ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు’ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, హామీలపై ఇంటింటికీ బాండ్లు కూడా ఇచ్చారన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *