సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం నేటి గురువారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 26వ తేదీన మొత్తం 23 స్థానిక సంస్థలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 30వ తేదీన కౌంటింగ్ లో ఫలితాలు వెలువడతాయి. మొత్తం 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించ నున్నారు. మొత్తం 1009 వార్డులు.. కార్పొరేషన్లు- 260 మున్సిపాలిటీల్లోని 749 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య – 24,98,152.. రెండోదశలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్లు 12,92,989 మంది కాగా, పురుష ఓటర్లు 12,04,753 మంది ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం 2,801 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు చింతలపూడితో సహా మొత్తం 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాల్లో మహిళలకు పెద్దపీట వేశారు. 19 ఛైర్‌పర్సన్ స్థానాల్లో 10 స్థానాలు మహిళలకే (అన్ని కేటగిరీల్లో కలిపి) రిజర్వ్ చెయ్యడం గమనార్హం.
