సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో రేపు గురువారం 29.12.2022 ఉ.11.00 లకు కళన్యాసం పూజలు నిర్వహించి శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం భక్తులకు ఇవ్వబడుతుంది అని ఆలయ సహాయ కమిషనర్ కార్య నిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేస్వరరావు మరియు ధర్మకర్తలు సభ్యులు తెలియచేసారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59 వ వార్షిక మహోత్సవాలు సందర్భంగా .ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల ఉత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
