సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. అరుణ్‌బాబు స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపు గురువారం (ఈనెల 16న) ఉదయం ఎనిమిది గంటలకు ఏలూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులో ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం ఐదు టేబుల్స్ ఏర్పాటు చేయటం జరుగుతుందని,( మొదటి , 2వ , 3వ ప్రాధాన్యత .. ఓటింగ్ కౌంటింగ్ ఉంటుంది.) కౌంటింగ్ సిబ్బందితో పాటు ఆయా అభ్యర్థుల ఏజెంట్లు కూడా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ను పరిశీలిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు మొత్తం పారదర్శకమైన రీతిలో వెబ్ కాస్టింగ్‌లో జరుగుతుందన్నారు. కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఫలితాలు వెలువరించిన తరువాత కౌంటింగ్ సెంటర్ పరిసరాల ప్రాంతాలలో ఊరేగింపులు నిషేధమన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్‌ఓ ఏవిఎన్‌ఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
