సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్, నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి కార్యా లయం సంయుక్త ఆధ్వర్యంలో రేపు బుధవారం (ఈనెల 28న) రీజనల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్, మరియు భీమవరం కార్యాలయంలో పశ్చి మగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కృష్ణారెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రాజమహేంద్రవరం లోని మార్గాని ఎస్టేట్లో మెగా జాబ్ మేళాలో ఏలూరు, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యో గులు పాల్గొనవచ్చని పేర్కొ న్నారు. సుమారు 120కు పైగా కంపెనీల్లోదాదాపు 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్ని క్, డిగ్రీ, ఇంజనీరిం గ్, పీజీ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నా రు. మరిన్ని వివరాలకు సెల్ 9603161039, 91339 12947నంబర్లలో సం ప్రదిం చాలని కోరారు.
