సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రైతాంగ సమస్యలపై భీమవరం కలెక్టరేట్ వద్ద నేడు, సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు,అల్లూరి సాయి దుర్గరాజు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు స్థానిక రైతులు తో కల్సి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. జగన్ సర్కార్ దూరంగా పెట్టినట్లే ప్రకటించిన మిల్లర్లే మరల ఇవాళ రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, సకాలంలో కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. నిజానికి సివిల్ సప్లై చైర్మన్‌గా ఒక మిల్లర్ని, ఎమ్మెల్యే తండ్రిని వేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వమని సోము వీర్రాజు విమర్శించారు. చైర్మన్‌ని వెంటనే సస్పెండ్ చేయాలని, బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో ఎందుకని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలను రైతు దోపిడీ కేంద్రాలుగా మార్చారన్నారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరేవరకు, బీజేపీ కిసాన్ మోర్చా ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.డిమాండ్ చేశారు. రైతులకు ఇవ్వవలసిన ట్రాన్స్‌పోర్టు డబ్బులను మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు కలసి పంచుకుంటున్నారని విమర్శించారు, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4వేల కోట్లు రైతులకు బకాయిలు ఉంచారని ఇంకేం రైతుభరోసా అని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *