సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో కోవ్వాడ అన్నవరం, వీరవసరం మండలాలను పైలట్ గ్రామాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో,స్థానిక ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ కొవ్వాడ అన్నవరం లో తాజగా ఏర్పాటు చేసిన సమావేశంలో మొదట, శాశ్వత భూ హక్కుల పత్రాలను గ్రామంలోని రైతులకు పంపిణీ చేశారు. తరువాత, నెలాపోగులా గ్రామంలోని రైతులకు భూ హక్కుల పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ..సీఎం జగన్ రాష్ట్రంలో శాశ్వత భూమి హక్కు మరియు భూ రక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో రైతులు భూ వివాదాలలో ఎక్కువగా ఉండేవారని వారి పొలాల సర్వే కచ్చితమైన కొలతలతో నిర్వహించడం అంత సులభం కాదు, గతం నుండి సరిహద్దులు కచ్చితంగా ధ్రువీకరించడం కష్టంగా ఉండేది. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో రైతుల సమస్యలను గ్రహించారు. అందుకే అధికారంలోకి వచ్చాక .. గతంలో ఏ ప్రభుత్వం సాహసించని విధంగా రాష్ట్రంలో సుమారు 100 సంవత్సరాల తరువాత రాష్ట్రంలోని అన్ని భూములను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన కొలతలు తో భూమిపై ఎటువంటి వివాదాలు లేకుండా భూ రక్షణ రికార్డులను సృష్టించడమే కాక, రైతులకు చాలా పారదర్శక పద్ధతిలో భూ హక్కుల పత్రాలను అందించడం ప్రారంభించడం అది మన నియోజకవర్గం లో నా చేతుల మీదుగా కొవ్వాడ అన్నవరం రైతులకు అందించడం గర్వముగా ఉందన్నారు. త్వరలో అన్ని గ్రామాల రైతులకు పట్టాలు అందించడం పూర్తీ చేస్తామన్నారు. ఇకపై పల్లెలలో రైతుల మధ్య పొలం వివాదాలకు స్వస్తి పలికినట్లే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *