సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేయాలని రైల్వే బోర్డు ప్రకటించింది. వాటిలో కీలకంగా.. సెంట్రల్ రైల్వే – 376 పోస్టులు, తూర్పు మధ్య రైల్వే – 700 పోస్టులు, నార్త్ సెంట్రల్ రైల్వే – 508 పోస్టులునార్త్ వెస్ట్రన్ రైల్వే – 679 పోస్టులు, సౌత్ సెంట్రల్ రైల్వే – 989 పోస్టులు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే – 568 పోస్టులు, సౌత్ ఈస్టర్న్ రైల్వే – 921 పోస్టులు, దక్షిణ రైల్వే – 510 పోస్టులు, వెస్ట్ సెంట్రల్ రైల్వే – 759 పోస్టులు, వెస్ట్రన్ రైల్వే – 885 పోస్టులు ఉన్నాయి. ఈ ALP పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 10 ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2025. డిగ్రీ లేదా డిప్లొమా, ఐటీఐ వంటివి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారు. వీటి కోసం అప్లై చేయాలంటే అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు ఉండగా, గరిష్ట వయస్సు 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 9, 2025 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 2 (7వ CPC)లో ప్రారంభ జీతం రూ. 19,900 నుంచి రూ. 35 వేల వరకు లభిస్తుంది. ఈ ఉద్యోగంలో మంచి జీతంతోపాటు అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి.
