సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గామాన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం లో విశాఖపట్నం వైపు వెళ్తన్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే వారి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున పశివేదల నుంచి వీరంతా కారులో కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
