సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని నేటి శనివారం తెల్లవారు జామున విజయవాడ గన్నవరం విమానాశ్రయం కు చేరుకొన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు లండన్‌లో.. మరొకరు అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పక్షం రోజులు జగన్ దంపతులు.. వారి కుమార్తెలతో గడపడానికి వెళ్లారు. ఎన్నికల ఫలితాలు మరో 4 రోజులలో వెలువడుతున్న నేపథ్యంలో నేటి శనివారం పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు. సీఎం జగన్ నేటి, ఉదయం ఆయన ఉండవల్లి లో కీలక వైసీపీ నేతలతో రానున్న ఎన్నికల ఫలితాలు ఫై సమీక్షా నిర్వహించారు.
