సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. భారత దేశంలోనే కాదు.. రంగం ఏదైనా సరే ప్రపంచంలో ప్రముఖులలో భీమవరం వారు కచ్చితంగా ఒకరు ఉంటారు. ఇది ఇక్కడి స్థానబలంగా భావిస్తుంటారు. ఇక విషయానికి వస్తే.. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి ఉదయ్ బ్రిటన్ రాజకీయాలలో సుపరిచిత వ్యక్తిగా ఎదిగారు. ఆయన గతంలో బిటిష్ ప్రధాని గా ఎన్నికయిన ఋషి సునాక్ కు వ్యక్తిగత కార్యదర్శి గా కూడా పనిచేసారు. ఆయన తాజగా లండన్లో ని రాయల్ బరో ఆఫ్ కేన్సిoగన్ & చెల్సియా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు… ఆయన ఈ రోజు రాత్రి 11 గంటలకు (భారత కాలమాన ప్రకారం) ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందిందని భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామస్తులు తెలిపారు. దీంతో స్వగ్రామంలో ఆనంధోత్సాహాలు జరుపుకుoటున్నారు
