సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన దేశం నుండి వెళుతున్న టూరిస్టులతో డబ్బు సంపాదిస్తూ మన దేశం పౌరులు పై విషం కక్కుతున్న మాల్దీవ్ లు ( 5 లక్షల పైగా జనాభా ఉన్న చిన్న ద్విపాల సముదాయం ) మన దేశం ప్రత్యర్థి చైనా తో అంటకాగుతూన్నా నేపథ్యంలో .. ఇటీవల ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మాల్ దీవులకు వెళ్లే అనేక మంది పర్యాటక ప్రేమికులు దానికి బదులుగా ఇండియాలోని కేంద్ర పాలిట ప్రాంతం లక్షదీప్ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నిలించింది. ఈ విమానయాన సంస్థ ప్రతిరోజూ 70 సీట్ల విమానాలను ద్వీపానికి నడుపుతోంది. ఇటీవల పెరిగిన డిమాండ్ దృష్ట్యా..తాజాగా లక్షద్వీప్‌ను సందర్శించాలనుకునే ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో మరిన్ని అదనపు విమానాలను కూడా మొదలుపెట్టింది. ఈ తరుణంలో తాజాగా కేరళలోని కొచ్చి అగట్టి నుండి అదనపు విమానాలను ప్రారంభించింది. వారానికి రెండు రోజులు అంటే ఆది, బుధవారాల్లో అదనపు విమానాలు నడుస్తాయని అలయన్స్ ఎయిర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిన సరే 3 నెలలు వరకు టికెట్స్ హౌస్ పుల్ అట.. మరిన్ని అదనపు విమానాలు నడపడానికి యత్నాలు మొదలయ్యాయి.
