సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, ఆదివారం ఉదయం వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన 12 మంది పొట్ట కూటి కోసం కూలీపనికి వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యలో వాహనం తిరగబడి గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ననేపథ్యంలో వారిని కలసి పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకొని , వారు కోలుకోనేవరకు కావలసిన ప్రభుత్వ సహకారం అందిస్తామని, త్వరగా కోలుకొంటారని దైర్యం చెప్పి భరోసా అందించారు. వారికీ కావలసిన అన్నిరకాల వైద్యసహకారం అందించాలని డాక్టర్స్ ను ఆదేశించారు. అనేకసారులు వాయిదా పడుతూ ఎట్టకేలకు రేపు ( 21వ తేదీ )నర్సాపురం లో సీఎం జగన్ పర్యటన ఖరారు కావడం తో సీఎం పర్యటనలో ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలులో భీమవరం నియోజకవర్గ శివారు ప్రాంతాలు కూడా ఉండటంతో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భీమవరం నుంచి రేపు సోమవారం విశేషంగా వైసిపి నేతలు జగన్ పర్యటనలో పాల్గొనున్నారు.
