సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఆషాడ పౌర్ణమి నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, సోమవారం శ్రీ అమ్మవారికి ఎన్నో రకాల ఆకూ,కూరగాయలతో, పుష్పాలు పండ్లతో ‘శ్రీ శాకాంబరీ దేవి’ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం అంతా ఆకుకూరలు, కాయగూరలు ఎన్నో రకాల పండులు పువ్వులు తో చక్కగా అలంకరించడంతో శ్రీ అమ్మవారు ..తన భక్తులకు సుఖ సంతోషాలకు, ఆహారానికి ఏ లోటు రానివ్వనని అభయం ఇచ్చే వనదేవత గా సాక్షాత్కరించారు. ( ఫై చిత్రంలో చూడవచ్చు). రేపు మంగళవారం కూడా భక్తులు అమ్మవారిని ‘శ్రీ శాకాంబరీ దేవి’ గా దర్శించుకునే అవకాశం ఉంది. ఆలయం ఆవరణలో పౌర్ణమి సందర్భముగా వేద పండితులతో ‘చండి హోమం’ నిర్వహించారు
