సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కలపాలని గోదావరి తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా నరసాపురం నుండి గోదావరి నదిపై అటు కోనసీమకు వెళ్లాలంటే వేలాది మంది ప్రయాణికులకు ఫాంటు మాత్రమే పెద్ద దిక్కుగా ఉంటూవస్తుంది. అనేక దశాబ్దాలుగా ఎన్నోసారులు అనేక అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులను దాటుకుని వంతెన నిర్మాణ పనులకు వచ్చే జనవరిలో టెండర్లు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించడానికి ప్రభుత్వ అధికారులు సమాయత్తం అవుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లోఇచ్చి న హామీ మేరకు వంతెన నిర్మా ణం పై దృష్టి పెట్టారు. ముందుగా 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించి..రూ.490 కోట్లతో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మిం చిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా మార్పు చేసి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చి మగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం , సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించనున్నారు.నిజానికి ఈ నెల 18న నరసాపురంలో జరిగిన ముఖ్య మం త్రి పర్య టనలో వశిష్ట వం తెనకు కూడా శంకుస్థాపన జరగాలి. తీరా సీఎం పర్య టన దగ్గరికి వచ్చే సమయానికి మళ్లీ రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. ఏది ఏమైనా వసిష్ఠ వంతెన త్వరలో పూర్తీ కావాలని కోరుకొందాం..
