సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో కోస్తా ఆంధ్రా లో అన్ని ప్రాంతాలలో బలమైన ఈదురుగాలులు తో సహా భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. విజయవాడలో కొండ చర్యలు విరిగి పడి ఆస్తినష్టం జరిగిదని. ఈ నేపథ్యంలో నేడు, శనివారం ఉదయం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష చేపట్టారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అందరూ అప్రమత్తం గా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *