సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వైసీపీ కి చెందిన జడ్పీ చైర్మెన్ ఘంటా పద్మశ్రీ అడ్జక్షతన జరిగిన సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులతో పాటు కొత్తగా ఎన్నికైన కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో సభ హోరాహోరీగా జరిగింది. ఎమ్మెల్యేలు వివిధ స్థానిక సమస్యలను ప్రస్తావించే సమయంలో జడ్పీ చైర్‌పర్సన్‌కు దెందులూరు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. జడ్పీ చైర్‌పర్సన్ చింతమనేని నుద్దేశించి సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలని అనడంతో చింతమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కేవలం ఒక్క పూట మాత్రమే ఏర్పటు చెయ్యడంతో జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడేందుకు సమయం లేకుండా పోతోందని, పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారులు, ఎమ్మెల్యేలతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్యశ్రీ మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతానికి 15వ ఆర్ధిక సంఘ నిధులను గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పని చేద్దామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.గత ప్రభుత్వ హయాంలో పంట అమ్మిన రైతులకు 1600 కోట్లు రూపాయలు బకాయిలు పడితే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ బకాయిలు చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందు వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని చంద్రబాబు కేంద్రం తో చేసిన సంప్రదింపులతో రూ.12,157 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయించారన్నారు మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల వన మహోచవం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనంద రిపైనా ఉందన్నారు.తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. భారీ వర్షాలు ,వరదల వల్ల జూలై నెలలో రైతాంగం నష్టపోయారని దీనికి సంబంధించిన పంట కాల్వల్లో పూడికతీత, గుర్రపుడెక్క తీయించి పంటను కాపాడాలన్నారు. సమా వేశంలో ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, మద్దిపాటి వెంకట్రాజు, చిర్రి బాలరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, పాల్గొన్నారు
