సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతవారం అంట అంతా వరుసగా నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు, సోమవారం కాస్త కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి లాభాల రుచిని చూపించాయి. మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ వారాన్ని సూచీలు పాజిటివ్‌గా ప్రారంభించాయి. ముఖ్యంగా లోహ, రియాల్టీ, ఫైనాన్సియల్ షేర్లు రాణించాయి. దీంతో సెన్సెక్స్ 498 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలను ఆర్జించింది. గత శుక్రవారం ముగింపు (78, 041)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 450 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే నడిచింది. చివరకు 498 పాయింట్ల లాభంతో 78, 540 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 165 పాయింట్ల లాభంతో 23, 753 వద్ద రోజును ముగించింది.సెన్సెక్స్‌లో సెయిల్, జిందాల్ స్టీల్, బంధన్ బ్యాంక్, జుబిలెంట్ ఫుడ్స్, మాక్రోటెక్ డెవలపర్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 558 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.13గా స్థిరంగా ఉంది.
