సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ ఇటీవల వైసిపి నేతలపై చేస్తున్న వ్యంగ్యాస్త్రాలు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. నిజానికి పవన్ వాహనం వారాహి కాదని.. అది నారాహి అని , దానికి సమర్పించిన వారు నారావారేనని అందరికి తెలుసునని ఆరోపించారు. నిజానికి పవన్ కల్యాణ్ కి బీజేపీ తో కలసి వెళ్లాలా? లేక టీడీపీ తో కల్సి వెళ్లాలా? అసలు ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అందరు పాటించాలని, అయితే చట్టాలపై అవగాహనా లేని పవన్ దీనిని కూడా రాజకీయం చేస్తూ చేస్తూ… ఏ రంగు చొక్కా వేసుకోవాలని, మీ వైసిపి వాళ్ళ పర్మిషన్ తీసుకోని ఊపిరి తీసుకోవాలా? అని మాట్లాడుతూ ‘వారాహి రంగుపై పవన్ కల్యాణ్ అనవసర వివాదం సృష్టిస్తున్నారు అని, ఆయన తెలంగాణా హైదరాబాద్ లో నివాసం, అక్కడే ఉంటాడు.. ఏపీలో మాత్రం వివాదాలు లేపుతాడు.. కాబ్బటి ఊపిరి తీసుకోవాలో వద్దో సీఎం కెసిఆర్ పర్మిషన్ ను అడిగితె మంచిదని , ఆయన కరెక్టుగా చెబుతాడని ఎద్దేవా చేసారు. ఏపీలో 175 స్థానాల్లో అభ్య ర్థులను పెట్టుకొలేని పార్టీ జనసేన అధినేత పవన్ తో పోటీ పడటం ఏమిటి? పవన్ విమర్శలు ఫై ముఖ్య మం త్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన పని లేదన్నారు మంత్రి రోజా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *