సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR, దేవర లతో వరుసగా 2పాన్ ఇండియా విజయాలతో మంచి జోష్ మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్, హృ తిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ట్రైలర్ తాజగా నేడు, శుక్రవారం వచ్చేసింది.ఈ భారీ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నో లావిష్ సినిమాలతో భారీ హిట్స్ సాధించిన యష్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మించి వచ్చే ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ తో మరింత హైప్ పెంచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీ కి గుర్తుకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్అవుతున్నాయి. ఈ కొత్త ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జోష్ పెంచేలా ఉంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ హోరాహోరీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఆగస్టు 14న రజినీకాంత్, నాగార్జున నటిస్తున్న కూలీ మూవీ కూడా వస్తోంది. ఈ రెండు మల్టీస్టార్ సినిమాలు సినిమా హాళ్లలో ప్రభంజనం సృష్టిస్తాయని సినీ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.
