సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారీగా కాకపోయినా వరుసగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భీమవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వర్షపు ముసురు నేడు, శుక్రవారం కూడా కొనసాగుతుంది. అతికిలక సమయంలో ఎట్టకేలకు వర్షాలు పడుతుండటంతో డెల్టా ప్రాంతంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో చేపలు, రొయ్యల చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్ లోపించడంతోపాటు తెగుళ్లు సోకే ప్రమాదం ఉండడంతో నిరంతరాయంగా ఏరియేటర్లను తిప్పుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా వర్షాలు కురుస్తున్నాయి. రేపు శనివారం అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉరుములు పిడుగులతో కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో సముద్రతీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
