సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న శుక్రవారం ఉదయం విడుదల కావలసిఉన్న చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర పార్ట్‌ 2’ సినిమా విడుదల ఓటిటి రైట్స్ వివాదం కారణంగా నిన్న సాయంత్రం నుండి థియేటర్స్ లో విడుదలయిన నేపథ్యంలో అభిమానులను హీరో విక్రమ్ క్షమాపణలు తెలిపారు. ఇక ‘తంగలాన్‌’ తర్వాత విక్రమ్‌ నటించిన చిత్రమిది. ‘వీర ధీర శూర’ చిత్రాన్ని ‘వీర ధీర శూర పార్ట్‌ 2’గా విడుదల చేశారు. పార్ట్‌ 1 విడుదల కాకుండానే పార్ట్‌ 2 విడుదల చేశసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. ఎస్‌.యు అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ కథానాయిక. పృథ్వీ, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రధారులు. సినిమా కథ విషయానికి వస్తే కధంతా ఒక్కరాత్రిలో జరిగే క్రైమ్ అంశాలతో ముడిపడిఉంది. హీరో.. కాళీ (విక్రమ్‌), తన భార్య వాణి (దుషారా విజయన్‌) చిన్న కిరణా కొట్టు నడుపుకుంటూ జీవితం సాగిస్తారు. అయితే కాళీకి మరో కథ ఉంటుంది. అందులో రవి (పృథ్వీ రాజ్‌) కొడుకు కన్నా (సూరజ్‌ వెంజరమూడు)లకు అనుచరుడుగా ఉంటాడు కాళీ. గతాన్ని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయితే పాత కథలో రవి, కన్నా… ఇద్దరినీ ఎన్‌కౌంటర్‌ చేయాలనుకుంటాడు ఎస్పీ అరుణగిరి (ఎస్‌.జె. సూర్య). తెల్లవారేలోపు ఆ ఎన్‌కౌంటర్‌ అయిపోవాలి.. లేదంటే తండ్రీ కొడుకు ఇద్దరూ ఆనందంగా బయట తిరగగలరు.. ఇందులో ఎవరు విజయం సాధించారు? అన్నది సస్పెన్సు.. ఇక సినిమా మొదలు మాత్రం ఎస్పీ అరుణగిరి, రవి మధ్య ఉన్న వార్‌తో మొదలవుతుంది. ఎస్పీని చంపేయాలని రవి, తండ్రీ కొడుకులైన రవి, కన్నాలను ఎన్‌కౌంటర్‌ చేయాలని ఎస్‌పీ అరుణగిరి ప్లాన్‌ చేసే సీన్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తరువాత సన్నివేశాలన్ని ఆసక్తిగా సాగుతాయి. ఇక సినిమా ఎలాఉందటే .. హీరో చియాన్ విక్రమ్ ఎప్పటిలానే పాత్రలో విజృభించేసాడు. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే విధ్వంసం సృష్టించినట్లు నటించారు. దిలీప్‌ మరణం తర్వాత పోలీసులపై, పెద్దాయన అని పిలవబడే ఓ వ్యక్తి ముందు విజృంభించి ప్రాణాలు తీయడంలో ఆయన నటన ప్రతిభ కనిపించింది. అయితే మొదటి పార్ట్‌లో రివీల్‌ చేయడం కోసం ఎన్నో ట్విస్ట్లను దర్శకుడు జస్ట్‌ ఇంట్ ఇచ్చి వదిలేశాడు. ఎస్‌జే సూర్య అవకాశవాది పాత్రలో మరోసారి చప్పట్లు కొట్టించేలా నటించారు. అతని డైలాగ్‌ బాగున్నాయి. కన్నా పాత్రలో సూరజ్‌ వెంజరమూడు అద్భుతంగా నటించాడు. తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న థర్టీ ఈయర్స్‌ పృధ్వీకి చాలా మంచి పాత్ర దక్కింది. పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు.అతనికిది మంచి పాత్ర అని చెప్పొచ్చు. వాణి పాత్రలో చేసిన దుఫారా విజయన్‌ నటన బావుంది. జీవీ ప్రకాశ్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. చివరి అర్ధగంటలో వచ్చే సన్నివేశాలు యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తాయి. చియాన్ విక్రమ్ కు చాలకాలం తరువాత వచ్చిన సోలో హిట్.. నో డౌట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *