సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి లేడి సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్నా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). సయీ మంజ్రేకర్ కథానాయిక. సోహైల్‌ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ నేడు, సోమవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ‘‘పది సంవత్సరాల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్. కానీ, చావుకు ఎదురవుతున్న ప్రతిసారీ నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్’’ అంటూ విజయశాంతి, రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు ఈ అర్జున్ విశ్వానాథ్ కనుసైగలు శాసిస్తాయి” అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్స్ హడావిడి కనపడింది. తల్లీ తనయుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సిద్ధం చేస్తున్నారు.
