సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సినీ మొగల్ గా ప్రసిద్ధి పొందిన ప్రముఖ సినీ నిర్మాత, బాపట్ల లో తెలుగుదేశం పార్టీ ఎంపీ గా గతంలో పనిచేసిన స్వర్గీయ డి రామానాయుడుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 2003లో విశాఖపట్నంలోని బీమిలి బీచ్ రోడ్డులోని కొండలపై సినీ స్టూడియో నిర్మాణం కోసం (ఎకరా భూమిని 5.2 లక్షల చొప్పున) కేటాయించిన 34. 44 ఎకరాల కొండ భూములులో నిర్వాహకులు కోట్ల రూపాయలు ఖర్చుతో అభివృద్ధి చేసారు. రోడ్లు వేసి స్టూడియో ఆఫీస్ భవనాల నిర్మాణాలకు పోను మిగిలిన 15-17 ఎకరాల భూమి నిఖాళీగా ఉంచడంతో..దానిని తిరిగి ప్రభుత్వ పరం చేసుకోవాలని ఆ మిగులు భూమి దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తిస్తూ..ఆ భూమి 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. స్టూడియో నిర్వాహకులకు ( దగ్గుబాటి సురేష్ బాబు ) షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విశాఖపట్నం కలెక్టర్‌ను ఆదేశించింది. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో కూడా 15 ఎకరాలు భూమిని తమకు మంచి ధర కు తమకే అమ్మి వెయ్యాలని దగ్గుబాటి సురేష్ కు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
