సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ పోర్ట్ లో 25వేల కిలోల గూడ్స్ లో దర్యాప్తు చెయ్యగా వేల కోట్ల విలువైన? మత్తు పదార్ధాలు దొరికాయని అది సంధ్య ఆక్వా ఎగుమతుల కు చెందిన కంపెనీ దిగా నిర్ధారించి సిబిఐ దర్యాప్తు చెప్పటడం సంచలనమ్ రేపింది. దీనితో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ దాడులు నేటి తో ముగిశాయి.దీనిపై మొదట టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీ ఫై విమర్శలు చెయ్యడం గమనార్హం.. అయితే ఆ కంపెనీ కి చెందిన పెద్దలతో టీడీపీ పార్టీకి చెందిన అనుబంధంతో కూడిన ఆధారాలు పట్టుకొని వారిని అనుమానితులుగా చేర్చాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. సీఈవోతో.. పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నకల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహిం చడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యా దులో పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఐదేళ్ల కిందట అమరావతి రాజధాని కోసం సింగపూర్ మంత్రిని తెచ్చా డు. ఆ సింగపూర్ మంత్రి అవినీతి కేసులో ఇప్పుడు జైల్లోఉన్నా డు. చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది. చంద్రబాబు, వదిన చుట్టాలు, పిల్లలే ఈకంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే. . కాబట్టి లోతుగా విచారణ జరపాలని సీఈవోకు ఫిర్యాదు చేశామని.. విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *