సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరిద్దరు కి హిట్’ పడి తీరవలసిందే.. లేకపోతె ఇదే ఆఖరి అవకాశం కావచ్చు . ఎన్ని సినిమాలు చేసిన దాదాపు 5 ఏళ్లుగా హిట్ ముఖం చూడని హీరో గా ఒక్కపుడు అగ్ర దర్శకుడుగా దూకుడు’ కొనసాగించి చాలాకాలంగా హిట్స్ లేక వెనుకపడిపోయిన శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ విశ్వం సినిమాతో రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్స్ పై టిజి విశ్వప్రసాద్, దోనేపూడి చక్రపాణి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే విశ్వం సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ట్రైన్ లో ఫ్యామిలీ కామెడీతో పాటు టెర్రరిజం కాన్సెప్ట్, భారీ యాక్షన్ సీన్స్ అన్ని దూకుడు’ సినిమా స్థాయి శ్రీనువైట్ల కనిపిస్తున్నాడు. విజయదశమి కానుకగా ఈ సినిమా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
