సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు, మూడోరోజు నేడు, ఆదివారం ఉదయం సింహ వాహన సేవ నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి ఆ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమము లో నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు తదితర భీమవరం వాసులు కూడా పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *