సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం పరిధిలోని సముద్ర బీచ్ వద్ద విహారానికి వచ్చిన కడలి శ్రీను ను అతని స్నేహితులే దారుణంగా కొట్టి అతని మరణానికి కారణమైన ఘటన ఇటీవల జిల్లాలో సంచలనం రేపింది. అయితే ఆ కేసులో నిందితులను సీఐ వి సురేష్ బాబు గత బుధవారం అరెస్ట్ చేసారని ఎస్సై ఎం .వీరబాబు ప్రకటించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… భీమవరం నియోజకవర్గానికి చెందిన వీరవాసరం మండలం వీరవల్లిపాలేనికి చెందిన కడలి కనకశ్రీనివాస్(41) ఈ నెల 13న తన స్నే హితులతో కలిసి బీచ్ కు వచ్చారు. అయితే పాతగొడవల తో కక్ష పెంచుకున్న ఏడుగురు స్నేహితులు కలిసి కనకశ్రీనివాస్ ను తీవ్రంగా కొట్టిగాయపరిచారు. అతనికి భీమవరంలోని ఆసుపత్రిలో చికిత్స అందించిన తదుపరి హైదరాబాదు తరలించగా అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతిచెందాడు. ఘటనకు సంబంధించి కనకశ్రీనివాస్ భార్య చాముం డేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ దర్యాప్తు పూర్తిచేసి నిందితులు పిల్లా దిలీప్ దుర్గ కుమార్,మణికంఠ, తానింకి శ్రీరమేష్, దాడి ప్రసాద్, మల్ల నరసింహమూర్తి, యాల్లపు మంగప్రసాద్, సఖిరెడ్డి ని భాస్కర వెంకటరమణలను అరెస్టు చేశారని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారని ఎస్ ఐ ప్రకటించారు.
