సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో బాగంగా ఇటీవల ఎడతెరపి లేకుండా గ్రామాలలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ వారికీ జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పధకాలు అందుతున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు, వీరవాసరం మండలం మెంటేపూడి గ్రామంలో పర్యటించారు, అయన దృష్టికి వచ్చిన సమస్యలు ను అవకాశం ఉన్నంత మేర త్వరితంగా పరిష్కారించాలని అదికారులు ను ఆదేశించారు, స్థానిక ప్రజలు, పిల్లలు నుండి ఆయనకు విశేష స్వాందన వచ్చింది, ఆయనతో ఫొటోలు దిగడానికి పిల్లలు పెద్దలు ఉత్సహం చూపించడం జరిగింది.
