సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలోనే కాదు అమెరికా నుండి ఆప్ఘనిస్తాన్ వరకు భారీ క్రేజ్‌ తెచ్చుకున్న చిత్రం ‘పుష్ప–1’అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడి సత్తాకు ఓ బ్రాండ్‌. దానికి సీక్వెల్గా 3 ఏళ్ళు కష్టపడి నిర్మించిన పుష్ప–2 (Pushpa 2 Review) రిలీజ్ అయ్యింది. దేశవ్యాప్తంగా గతంలో ఏ హీరోకు ఏ భారతీయ సినిమాకు లేని విధంగా బెనిఫిట్ షోలు ,ప్రీమియర్‌ షోలకూ, టికెట్‌ రేట్లు 800- 1200 రూ వరకు పెంచుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్‌ ఇచ్చాయి. బెనిఫిట్‌ టికెట్‌ రేటు చూసి సినిమా తేడా కొడితే..?. మరో వైపు ఏపీలో రాజకీయ ప్రభావం.. ఇంకోవైపు .. మెగా ఫ్యాన్స్‌ తో తెలుగు రాష్ట్రాలలో అల్లు ‘ఆర్మీ’ విరోధం..సోషల్‌ మీడియాలో రచ్చ.. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తొలి చిత్రానికి మించి ఉందా? పుష్ప కథ విషయానికి వస్తే.. ఎర్రచందనం స్మగ్లర్ స్థాయి నుండి సిండికేట్‌ని, రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌). అధికార పార్టీకి సైతం ఫండ్‌ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని .. భార్య శ్రీవల్లి కోరిక ఫై సీఎం ప్రక్కన ఫోటో దిగుదామని పుష్ప బయలుదేరితే.. ‘అయితే స్మగ్లర్లు వెనుక నుండి పార్టీ ఫండ్‌ ఇచ్చేంత వరకే కానీ, ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం ( జగపతి బాబు) అవమానంగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్‌ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహద్‌ ఫాజల్‌) ప్రయత్నాలు చేస్తాడు. మరి పుష్ప ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్‌ తన మైండ్ గేమ్ తో, కండబలంతో చేయగలిగాడా, లేదా? అన్నదే కధ. ఇక సినిమా ఎలా ఉందంటే.. తొలి పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌ని దర్శకుడు సుకుమార్ మరో పదింతలు పెంచేసాడు. ప్రథమార్థం అంతా కాస్త నెమ్మదిగా నడిచినా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం మరో ఎత్తు. భార్య మాట దాటని పుష్ప భార్య చెప్పింది చేస్తే ఎలా ఉంటాదో చూపించాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, బాగోద్వేగాలు బాగా కుదిరాయి. ఇక సెకెండాఫ్‌కి వస్తే గంగమ్మ జాతర ఎపిసోడ్‌, అక్కడ ఫైట్ నెక్ట్స్‌ లెవల్‌. చీరకట్టుకొన్న అల్లు అర్జున్‌ ను అమ్మవారు ఆవహించిందా ? అన్నంత రీతిలో అక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 20 నిమిషాల సన్నివేశాలు కొందరికి పూనకాలు తెప్పించిన అనుమానం లేదు.. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ లుక్‌, మేకోవర్‌, మ్యానరిజం, యాస, ఇలా ప్రతి విషయంలో తన మార్క్‌ కసి చూపించాడు. ‘నదీలో లారీల ద్వారా ఎర్రచందనం బోర్డర్‌ దాటించే సీన్‌ ఆకట్టుకుంటుంది. అయితే పాటలలో సాహిత్యం తక్కువగా ఉంది. షెకావత్‌ పాత్ర క్లైమాక్స్‌కి వచ్చే సరికి బలంగా లేదు. ఇక జగపతిబాబు, రావు రమేష్, తారక్‌ పొన్నప్ప పాత్రల నిడివి తక్కువైనా గుర్తుండిపోతారు. భీమవరం బుల్లోడు సునీల్ మంగళం శ్రీను, ద్రాక్షాయణి అనసూయ పాత్రలూ సో..సో.. అంతే! ఉన్నాయంటే ఉన్నాయంతే! దేవిశ్రీప్రసాద్‌ పాటలు, ఉరమాస్ మ్యూజిక్ తో కట్టిపడేశారు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌ తో ‘పుష్ప3’ సినిమాకు రూట్‌ చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *