సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు లో ఆత్కూరు స్వర్ణభారత్‌ట్రస్ట్‌ ప్రాంగణంలో ఈనెల 15నుంచి పలు రకాలయిన వృత్తినైపుణ్య కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరదేశి తెలిపారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌(స్ర్తీ/పురుషులు) నర్సింగ్‌ (స్త్రీలకు మాత్రమే), డీటీపీ, ఐటీ బేసిక్స్‌ (స్త్రీ/పురు షులు) కోర్సుల్లో రెండునెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 10వ తరగతి వరకు చదివి, 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తామని, శిక్షణానంతరం కోర్సుకు సంబంధించిన మెటీరియల్‌, సర్జిఫికెట్స్‌తోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనలో తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్నియువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *