సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాటలు వెటకారం తో మాటల మాంత్రికుడిగా రాణిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర హీరో వెంక‌టేష్, శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కుతున్న ప్యామిలీ అండ్ యాక్షన్ సినిమా ‘ఆద‌ర్శ‌ కుటుంబం’. హౌస్ నెంబర్ 47 AK 47 అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా అక్టోబ‌ర్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది. దీనితో తాజాగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై 50 రూపాయలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్స్ ఇచ్చారు. ఈ పర్మిషన్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు అనగా 10 రోజుల పాటు ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *