సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలలో భాగంగా నేడు,గురువారం శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి రధోత్సవం లో వీక్షించడానికి నేటి సాయంత్రం సుమారు 20వేల మంది భక్తుల మద్య మేళతాళాలు, యువత నృత్యాలు బాణాసంచా కాల్పుల మధ్య పుష్ప, అరటి గెలల అలంకార భూషితమైన సుమారు 40 అడుగుల భారీ రధం ను యువత, చిన్నారులసందడితో మహిళల హారతులతో ,వందలాది భక్తులు లాగుతూ నేటి రాత్రి 7 గంటలకు నాచువారి సెంటర్ కు తీసుకొనివచ్చారు. అక్కడ ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు రధోత్సవం ప్రారంభంలో ప్రత్యేక పూజలు చేసారు. తదుపరి హరహర శంభో నామ స్మరణ మారుమ్రోగింది.అయితే బాణాసంచా కాల్పులు జరుగుతున్నప్పడు తరాజువ్వ వెళ్లి చలువ పందిరిపై పడటం తో స్వల్ప అగ్ని ప్రమాదం జరగటం వెంటనే మంటలను ఆర్పివేయడం జరిగింది. రధోత్సవాన్ని పోలీసులు భద్రతా ఏర్పాట్లను సమర్ధవంతంగా పర్యవేక్షించారు. మరోప్రక్క శ్రీ భీమేశ్వర స్వామి రధోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. 25 అడుగుల స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ రధోత్సవమ్ కూడా ఘనంగా బాణాసంచా కాల్పుల మధ్య సందడిగా సాగింది.
