సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో నేడు, జగన్ పర్యటనలో పలు కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు లో పాల్గొంటున్న నేపథ్యంలో.. .. భారత దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కు వైజాగ్ లో ఏకంగా 17 ఎకరాల సువిశాల విస్తీర్ణం లో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు రహేజాతో కలసి నేడు మంగళవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో ఇనార్బి ట్ మాల్ నిర్మా ణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృ ద్ధి చేయనున్నారు. 2026 నాటికి దీన్ని పూర్తీ చేసి అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశిం చుకుం ది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 250కిపైగా అం తర్జాతీయ బ్రాం డ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షం గా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మా ణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు రహేజా గ్రూపు లీజుకు పొందారు.
