సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ మొదలుకొని జనవరి 13 నుండి పిబ్రవరి 9 వతేది వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 60 వ వార్షిక జాతర మహోత్సవాలు లో అప్పుడే 8 రోజులు గడచిపోయాయి. అయితే గత 5 ఏళ్ళ ఉత్సవాలతో పోలిస్తే కనివిని ఎరుగని రీతిలో భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం తో పాటు ఉత్సవ చలువ పందిళ్ళలో ఏర్పాటు చేసిన నాటక, సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించడానికి ఇతరాత్ర భారీ సెటింగ్స్, లైటింగ్ అలంకరణలు, భారీ ప్లాట్ పామ్ షాపుల తీర్ధం లో పాల్గోవడానికి విశేషంగా భక్తులు హాజరు అవుతున్నారు. సంక్రాంతి పండుగ మొదటి రోజులలో గతంలో తక్కువగా భక్తులు వచ్చేవారు అయితే ఈసారి ఉత్సవాలు ప్రారంభం నుండి భక్తులు సాయంత్రం నుండి ఇసుక వేస్తె రాలనంత కోలాహలంతో ఆలయ పరిసరాలు కిలోమీటర్ మేర ఆబాల గోపాలం తో నిండిపోతున్నారు. నేటి ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన తో పాటు .. 7 గంటలకు అందరు స్త్రీ లు నటించే ‘సత్యహరిచంద్ర ‘ నాటకం ప్రదర్శించనున్నారు. రేపుసోమవారం రాత్రి 8గంటలకు శ్రీ ఆకాశ ఆర్కెస్ట్రా వారి సినీ మ్యూజికల్ నైట్ ఉంది. ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ( నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో..)అధ్యక్షులు రామాయణం గోవిందరావు తో కలసి మిగతా సభ్యులు ఉత్సవ నిర్వహణ చేస్తున్నారు. దేవాలయానికి వచ్చే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ అమ్మవారి దర్శనం వేగంగా జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాద్రి,తెలిపారు. వచ్చే విశేష భక్తులకు ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, మరియు చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *