సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల కూటమికి కల్పి 60 శాతం ఓటింగ్ ఉంటె ఒక్క వైసీపీ పార్టీకి 40 శాతం ఓటింగ్ వేస్తె ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? అని ప్రశ్నిస్తున్న వైసీపీ అధినేత జగన్ కు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రారంభం నేపథ్యంలో నేడు, సోమవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు బిగ్గరగా నినాదాలు చేస్తూ.. కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై వైసీపీ వ్యవహారశైలిపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు వ్యవహరించిన తీరు అసలు బాగోలేదన్నారు. గవర్నర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాల గురించి చెప్పారని దానికి వైసీపీ సభ్యులు అరుస్తూ అడ్డుకోవాలనుకోవటం హేయమని మండిపడ్డారు. జగన్ కు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేదన్నారు. ఓట్ల శాతం అనవసరం.. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని.. అది నిశ్చయం.. ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని .. అయితే మాకు 40 శాతం ప్రజలు ఓట్లు వచ్చాయని మాట్లాడే వైసీపీ నాయకులు జర్మనీకి వెళ్లిపోవచ్చు. మన దేశ నిబంధనల మేరకు ఓట్ల ప్రాతిపదికన వారికి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు ’’ అని స్పష్టం చేశారు.
