సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, గురువారం వైసీపీ పార్టీ కి భీమవరం నియోజకవర్గం ఇంచార్జి పదవికి రాజీనామా చేస్తూ అధినేత జగన్ కు లేఖ పంపించారు. ఈ సందర్భముగా గ్రంధి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో 2 సార్లు భీమవరం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చెయ్యడానికి అవకాసమ్ ఇచ్చిన ప్రజలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, భీమవరంలో నియోజకవర్గంలో వందలాది కోట్లతో గతంలో ఎవరు చెయ్యలేని అబివృద్ధి పనులు చేసానని, భీమవరం జిల్లా కేంద్రం గా సాధించానని , ఎన్నో వంతెనలు రోడ్డులు , మంచినీటి సౌకర్యం, పేదలకు స్థలాలు ఇండ్లు పంపిణి నిర్వహించానని దీనికి గత సీఎం జగన్ కూడా నిధులు ఇచ్చి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు.అయితే కొందరు వ్యక్తులు తాను చేసిన ప్రతి మంచి పనికి ఎదో లోపం అవినీతి అంతకడుతూ విష ప్రచారం చేసారని వారెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. అయితే తాను 2019 పవన్ కళ్యాణ్ ఫై విజయం సాధించడం తమ పార్టీలోనే ఓర్వలేని కొందరు పార్టీ పెద్దలు తనను అవమానించడమే పనిగా పెట్టుకొని తనకు ద్రోహం చేసారని ,తన ఎదుగుదల ను అడ్డుకున్నారని, మొన్న ఎన్నికలలో ఓటమి చెందిన కూడా జగన్ కోసం ఆయన వెంట నడిచానని అయినా జగన్ గారి కోటరీలో కొందరికి తాను రుచించటం లేదని ఇక విసుగు చెంది పార్టీకి పదవులకు రాజీనామా చేసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొన్నానని, ఈలోగా ఆ పార్టీ లో ఈ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుందని అయితే తాను తన అభిమానులను బాధపెట్టే పని చెయ్యనని, శ్రేయోభిలాషులు సూచనలు పాటించి భవిషత్తు లో మంచి నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు.
