సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం భీమవరం పట్టణం గునుపుడి ఇందిరమ్మ కాలనీకి చెందిన వైసీపీ నేత, నెలపర్తి జయనందరావు పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని, గూడూరి ఉమాబాల తదుపరి నేటి ఆచంట నియోజకవర్గంలో స్ధానిక శాసన సభ్యులు చెరుకువాడ రంగనాథరాజు తో కలిసి ఆచంట నియోజకవర్గం, పోడూరు మండలం, పండిత విల్లూరు గ్రామంలో ఎన్నికల శంఖారావం పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి వెళ్ళి, సీఎం జగన్ సంక్షేమ పధకాల లబ్దిని ప్రజలకు గుర్తుచేస్తూ..వాటిని రక్షించుకోవాలని కోరుతూ.. రాబోయే ఎన్నికల్లోఅసెంబ్లీ మరియు లోక్ సభకు చెందిన తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *