సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో నేడు, శుక్రవారం రచ్చబండ మీడియా సినిమా సమావేశంలో పాల్గొన్న నరసాపురం ఎంపీ రఘురామా ఇటీవల వస్తున్నా రాజకీయ సినిమాల పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా కోసం నేను చేసిన శపథానికి కట్టుబడే ఉన్నానని అన్నారు. వ్యూహం సినిమా విడుదలైన రోజు ఉదయాన్నే హైదరాబాదులోని థియేటర్లో మార్నింగ్ షో చూసి, థియేటర్ కు సినిమా చూడడానికి ఎంత మంది ప్రేక్షకులు వచ్చారో ఫోటో తీసి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ట్యాగ్ చేస్తానని చెప్పారు. వ్యూహం సినిమా కుదిరితే మార్నింగ్ షో దర్శకుడు రాం గోపాల్ వర్మతోనే కలిసి చూస్తానని చెప్పారు. ఇటీవల సంచలనమ్ సృష్టిస్తున్న రాజధాని ఫైల్స్ సినిమా తనకు నచ్చిందని , ఆ సినిమాలో తాను నటించవలసి ఉందని అయితే తాను ఢిల్లీలో ఉండటం వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయానని అన్నారు. ఓ ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి రైతుల గొంతు కోసిన విధానాన్ని రాజధాని ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపెడితే, ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయడమనేది దిగజారుడు రాజకీయం అని అన్నారు. ఎంత బిల్డప్ ఇచ్చిన ఎవరూ చూడరనడానికి యాత్ర 2 సినిమాయే ఒక నిదర్శనం. యాత్ర సినిమా లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధను చూపించారనే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి చూశారు . యాత్ర 2 జగన్మోహన్ రెడ్డి బయోపిక్ కావడంతో సినిమా థియేటర్ కు వెళ్లి చూడడమే మానివేశారు. వ్యూహాలు, శపథాలను రూపొందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం కామెడీగా వెళ్లి చూస్తారే కానీ ఎవరు ఆ చిత్రాలను సీరియస్ గా తీసుకోరని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *